'బాహ్య ఒత్తిళ్లు లేవు': యూపీఐ చార్జీలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత

రిపోర్టర్: కృష్ణ స్థలం: భారతదేశం

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ప్రవేశపెట్టడం వెనుక ఎలాంటి విదేశీ లేదా బాహ్య ఒత్తిళ్లు లేవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) నివేదికలో పేర్కొన్న అభ్యంతరాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. దేశీయ చిన్న కంపెనీలకు లాభదాయకమైన రెవెన్యూ మోడల్ సృష్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.