కూటమి సర్కార్ అక్రమ కేసులపై మాజీ ఎంపీ బుట్టా రేణుక నిప్పులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.