నా ప్రాణదాత యాంకర్ సుమంటూ కన్నీటిపర్యంతమైన నటి అల్లరి సుభాషిణి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో నటి అల్లరి సుభాషిణి మాట్లాడుతూ తన ప్రాణదాత యాంకర్ సుమ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో నడవలేని స్థితిలో ఉన్న తనకు సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల ఆర్థికంగా అండగా నిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమ అందించిన సాయం వల్లే తాను ఈరోజు బతికి ఉన్నానని, మళ్లీ పుడితే సుమ లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నట్లు సుభాషిణి భావోద్వేగంగా వెల్లడించారు.