అర్నబ్ తుపాను ప్రభావం: మొగల్తూరులో రెండో రోజు చంద్రబాబు ఏరియల్ సర్వే

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు రెండవ రోజు ఏరియల్ సర్వే నిర్వహించారని CMO ఆంధ్రప్రదేశ్ వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆయన నేడు మొగల్తూరులో పర్యటించారు. బాధితులను నేరుగా పలకరించి వారికి అందుతున్న సహాయక చర్యలను స్వయంగా సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరంగా పూర్తి అండదండలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.