'సేవా సంకల్ప్ అభియాన్'లో సీఎం చంద్రబాబు భాగస్వామ్యం: వారణాసి పర్యటన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: వారణాసి
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం విజయవాడ నుంచి వారణాసికి బయలుదేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. అనంతరం రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో వారణాసి–వాద్నగర్ సేవా యాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి అమరావతికి చేరుకుంటారు.