అమెరికాలో హెచ్ వన్ బి వీసా వ్యవస్థ రద్దుపై ఆందోళనలు
రిపోర్టర్: రాము
స్థలం: అమెరికా
అమెరికా ఐటీ రంగానికి కీలకమైన హెచ్ వన్ బి వీసా ప్రోగ్రామ్ను ఏడాదిలోగా పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డెస్పసీటో వెల్లడించారు. వీసా ప్రాసెసింగ్లో జరుగుతున్న భారీ మోసాలు, అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా లాభపడుతున్న భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.