అథ్లెట్లకు భారీ షాక్: గుండె మార్పిడి జాబితాలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Missouri
పద్దెనిమిదేళ్ల మిస్సోరి ఫుట్‌బాల్ ఆటగాడు డీజే జోన్స్‌కు ప్రాణాంతక గుండె సమస్య తలెత్తిందని, ఆయనకు గుండె మార్పిడి అవసరమని వైద్యులు తేల్చారని మిస్సోరి కోచ్ ఎలి డ్రింక్విట్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ వైద్య పరీక్షల్లో ఈ సమస్య వెలుగుచూడటంతో ఫ్లోరిడాలోని మాయో క్లినిక్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.