డీఎస్సీ నిరసనలపై పోలీసుల ఆంక్షలు తీవ్ర దుమారం

రిపోర్టర్: హరి స్థలం: విజయవాడ

డీఎస్సీ అక్రమాలపై రేపు విజయవాడలోని శాప్ కార్యాలయం ముట్టడికి వైసీపీ తలపెట్టిన ఆందోళనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసన ర్యాలీకు ఎలాంటి అనుమతి లేదంటూ పెనమలూరు వైసిపి ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయం, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.