కోనేరులో స్నానానికి వెళ్లి మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలసలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోనేరులో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతుల్లో శంకరపు వెంకటేష్, సారిది చందు, మండల హేమచంద్రరావు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే గ్రామానికి చెందిన ఏడేళ్ల వయసు గల ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.