జగన్‌రెడ్డిది ఫ్యూడల్ మనస్తత్వమంటూ టీడీపీ నేత బెందాళం అశోక్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీకాకుళం
మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిది ఫ్యూడల్ మనస్తత్వమని, నేర చరిత్ర కలిగిన ఆయన సైకో ధోరణితో ప్రవర్తిస్తున్నారని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన టీడీపీ నేత బెందాళం అశోక్ మండిపడ్డారు. నా మాట వినని వారిపై దాడులు చేస్తామనే రీతిలో జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతరులకు నీతులు చెప్పే అర్హత జగన్‌కు లేదని ఆక్షేపిస్తూ బెందాళం అశోక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.