ఏపీలో అల్పపీడన ప్రభావం.. అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.