స్కాట్లాండ్‌లో ఘనంగా సూర్య జ్యోతిక వివాహ వార్షికోత్సవం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Scotland
కోలీవుడ్ ప్రముఖ నటీనటులు సూర్య మరియు జ్యోతిక దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్కాట్లాండ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తమ పెళ్లి ప్రమాణాలను మరోసారి పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన వీడియోలు, ఫోటోలను సూర్య సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ పిల్లలు దియ, దేవ్ నడిపించగా చర్చిలో జరిగిన ఈ వేడుకలో సూర్య సోదరుడు కార్తీ దంపతులతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్కాట్లాండ్ అందమైన వాతావరణం తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసిందని, ఇక్కడి ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మరువలేమని సూర్య భావోద్వేగంతో పేర్కొన్నారు.