గాజువాకలో భారీ మోసం గుట్టురట్టు: హార్వెంచర్ సంస్థల ఎండీ అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
పెట్టుబడులపై రెట్టింపు లాభాలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేసిన హార్వెంచర్ సంస్థల ఎండీ పడాల సోమశేఖరరావును విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ వాసునాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం, సంస్థ పేరిట పలు జిల్లాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసి వేలాది మంది నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. కొన్నాళ్లుగా చెల్లింపులు నిలిపివేసి పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.