జూరాల జలాశయంలో తిరుగు జలాల రంగు మార్పు: ఆందోళనలో మత్స్యకారులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: గద్వాల
జూరాల జలాశయం తిరుగు జలాలు ముదురు ఆకుపచ్చని రంగులోకి మారుతుండటంతో మత్స్యకారులు మరియు స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక పరిశ్రమల వ్యర్థాల వల్లే నీరు కలుషితమవుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నీటి రంగు మారడంపై డీఈ నాగేశ్వరావు స్పందిస్తూ అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తామని వాటర్ గ్రిడ్ డీఈ రవిచంద్రరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.