స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో సత్తా చాటిన ఏపీ నగరాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 ఫలితాల్లో ఏపీ నగరాలు అద్భుత ప్రతిభ కనబరిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో గుంటూరు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. విజయవాడ 8వ స్థానంలో నిలవగా, ఏలూరు మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.