రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమంటూ చంద్రబాబు స్పష్టం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించి పునర్నిర్మాణం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెడతామని తెలిపారు. అలాగే అర్నబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.