బ్లడ్ బ్యాంక్ పేరుతో రక్తం అమ్ముకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

బ్లడ్ బ్యాంక్ ద్వారా తాము రక్తం అమ్ముకుంటున్నామంటూ గతంలో వచ్చిన నిందలను టాలీవుడ్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తనకు వచ్చే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే ఆ ఆరోపణలు ఎంత ఫ్యూలిష్‌నెసో అర్థమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అభిమానులను నేరుగా కలవడానికి ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.