కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య: రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రాయపర్తి

భర్తతో తలెత్తిన గొడవల కారణంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్పల్లి గ్రామానికి చెందిన గాజుల దివ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతితో ఆగ్రహించిన పుట్టింటి బంధువులు అత్తగారింటి వద్దకు చేరుకుని గొడవకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.