ఏలూరులో బైక్ స్టంట్లు చేసిన యువకుల అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఏలూరు
ఏలూరులో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకర బైక్ స్టంట్స్‌కు పాల్పడిన ఇద్దరు యువకులను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా వారిని గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.