స్విమ్స్ లో మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు.. వైద్య సేవల్లో నిపుణుల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి!
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి స్విమ్స్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు డాక్టర్ గుడారు జగదీష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు శ్రీవారి వైద్య సేవల్లో భాగస్వాములు కావాలని కోరారు. నిమ్హాన్స్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించి వైద్యం అందించాలని సూచించారు.