వైద్య నిపుణుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు: నేషనల్ బోర్డ్ ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ ఎస్ఎస్ ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా నవంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలను డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేయడానికి అర్హులని వెల్లడించారు.