లక్నోలో షాకింగ్ ఘటన: గర్ల్ఫ్రెండ్ కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన విద్యార్థి

రిపోర్టర్: సునీల్ స్థలం: Lucknow

గర్ల్ఫ్రెండ్తో తిరిగేందుకు, ఆన్లైన్ గేమింగ్ అప్పుల కోసం కుటుంబ సభ్యుల నుంచి అయిదు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ఓ విద్యార్థి స్వయంగా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు లక్నో పశ్చిమ డీసీపీ జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న పదిహేడేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో అసలు నిజం నిగ్గుతేల్చి అతడిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు.