ఆపదలో ఉన్న బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల మండలం బడివానిపేటకు చెందిన మారుపల్లి సీతమ్మ వైద్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, కేవలం రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు మంజూరయ్యేలా స్థానిక ఎమ్మెల్యే నడుకుడితి ఈశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు అనుమతి పత్రాన్ని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం బాధితురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.