'టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్': చంద్రబాబు, లోకేష్‌తో కలిసి పాల్గొన్న నేతలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Amaravati

టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా లీడర్షిప్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.