కుటుంబంతో కలిసి ఘనంగా వినాయక చవితి జరుపుకున్న నాగశౌర్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య తన కుటుంబసభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భార్య అనూష, తల్లిదండ్రులతో కలిసి ఆయన భక్తిశ్రద్ధలతో వినాయక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో వారి పెంపుడు కుక్కలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.