2036 ఒలింపిక్స్‌కు అమరావతి వేదికయ్యే అవకాశం ఉందా?

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా, ఏపీ రాజధాని అమరావతికి కూడా క్రీడా వేదికగా అవకాశం లభించవచ్చని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. అయితే అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా బిడ్ కొనసాగుతుండగా, అమరావతిలో అంతర్జాతీయ మౌలిక వసతుల అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో కొన్ని పోటీలు నిర్వహించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అధికారిక నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.