పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియ ఎటువంటి అంతరాయాలు లేకుండా వేగంగా పూర్తి కావాలని అక్కడి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.