గురువు చేతుల మీదుగా ఘన సన్మానం అందుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నరసయ్య

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో నిర్వహించిన రెండో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్ట్ కట్టెకోల చిన నరసయ్యను ఆయన గురువు శేషయ్య సారు ఘనంగా సన్మానించారు. గురువు చేతుల మీదుగా సత్కారం అందుకున్న నరసయ్య భావోద్వేగంతో పాదాభివందనం చేశారు. తన గురువే స్వయంగా సన్మానించడం మహాభాగ్యమని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.