బెజ్జూర్ అభివృద్ధికి పెద్దపీట: వర్షాకాలం నాటికి రోడ్లు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బెజ్జూర్

బెజ్జూర్ మండలంలో రోడ్లు, వంతెనల నిర్మాణ పనులను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు. సోమిని గ్రామంలో ఇందిరమ్మ గృహాన్ని ఎమ్మెల్సీ దండే విట్టల్ తో కలిసి ఆయన ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.