స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటుపై అమరావతిలో కూటమి నేతల కీలక భేటీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ స్థానాల సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబు, జనసేన, బీజేపీ నేతలు అమరావతిలో చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. రిజర్వేషన్ల ప్రాతిపదికన బలమైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే తుది స్పష్టత వస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు.