జంతర్ మంతర్ వద్ద కలకలం: పోలీసు బస్సును అడ్డుకున్న యువతి వీడియో వైరల్

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళన సందర్భంగా నిరసకారులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసు బస్సును ఓ యువతి ఒంటరిగా అడ్డుకోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో, ఇది గతంలో ముంబైలో నటి రియా అహిర్ చేసిన నిరసనను తలపిస్తోందని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నట్లు దిశ ప్రత్యేక ప్రతినిధి తెలిపారు.