మహిళలకు బతుకమ్మ కానుక: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి ఏర్పాట్లు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోటీ ఐదు లక్షల మంది మహిళలకు కొత్త చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాలకు చీరలు చేరుకోగా, ఈ నెల ఇరవయ్యవ తేదీ నాటికి తయారీ ప్రక్రియ వంద శాతం పూర్తవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.