యష్ 'టాక్సిక్' సినిమాకు ఓటీటీలో భారీ ఎదురుదెబ్బ

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' సినిమాకు బాక్సాఫీస్ వద్దే కాకుండా డిజిటల్ మార్కెట్లోనూ భారీ షాక్ తగిలింది. విడుదలకు ముందు రూ.150 కోట్ల వరకు పలికిన ఓటీటీ ఆఫర్, సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం రూ.30 కోట్లకు పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మేకర్స్ డిజిటల్ రైట్స్ కోసం కొత్త ఎడిట్ చేసే ఆలోచనలో ఉన్నారు.