నిత్యావసరాల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక విజిలెన్స్ కమిటీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పకుండా చూడటం, ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖలో 12 మంది ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరుకుల లభ్యత, ధరల పర్యవేక్షణ, బ్లాక్ మార్కెటింగ్ నివారణతో పాటు రైస్ మిల్లులు, రేషన్ షాపులు, హోల్‌సేల్ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఈ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు.