వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్చరిక: షింగిల్స్ వ్యాధిపై వైద్య నిపుణుల తీవ్ర ఆందోళన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
చిన్నతనంలో వచ్చే చికెన్‌పాక్స్ వైరస్ దశాబ్దాల తర్వాత షింగిల్స్ రూపంలో మళ్లీ దాడి చేస్తుందని క్లినికల్ ఇన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామినాథన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గి ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.