చిన్నారుల ఆరోగ్య రక్షణకు తల్లులు పోషకాహారం అందించాలన్న సర్పంచ్ రూప

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. సర్పంచ్ రూప బాల నరసయ్య మాట్లాడుతూ తల్లులు ప్రతిరోజు పిల్లలకు చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం అందించాలని కోరారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ గౌరోజు రమణ మాట్లాడుతూ బాలామృతంతో రుచికరమైన వంటలు చేసి తినిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొంత సుధాకర్, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.