మోదీ ఆర్థిక విధానాలపై ప్రపంచ దిగ్గజాల ప్రశంసలంటూ జీ కిషన్ రెడ్డి వెల్లడి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు ప్రశంసిస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ అధినేత జోన్ గ్రే మోదీ ప్రభుత్వ పాలనను కొనియాడారని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రశంసిస్తూ విదేశీ ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన సోషల్ మీడియా వేదికగా వివరించారు.