విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న శరన్నవరాత్రి మహోత్సవాల ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం లాంఛనంగా విడుదల చేసినట్లు దేవస్థానం ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. దేవస్థానం నూతన పూజా మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్న ప్రత్యేక ఖడ్గమాలార్చన, చండీయాగం వంటి సేవలను భక్తులు ఇంటి వద్ద నుంచే పరోక్షంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా భక్తులు ఈ సేవా టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.