చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తే అమెరికా నిఘాతో జైలుకే
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఇంటర్నెట్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ ఇతరులకు షేర్ చేస్తున్న వారిని అమెరికా సాంకేతిక నిఘా సంస్థలు ఇట్టే పసిగడుతున్నాయి. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ఠాణా పరిధిలో ఇటీవల ఇలాంటి మూడు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గాజులరామారానికి చెందిన ఒక వ్యక్తితో పాటు మహిళ కూడా ఈ వికృత చేష్టలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను చూడటం, డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం తీవ్ర నేరమని, ఐటీ చట్టంతో పాటు పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.