22 ఏళ్ల క్రితం నాటి పిండంతో 54 ఏళ్ల మహిళ అద్భుత ప్రసవం
రిపోర్టర్: సునీల్
స్థలం: World
గ్రీస్‌లోని ఏథెన్స్లో 54 ఏళ్ల క్రిస్టినా అనే మహిళ 22 ఏళ్లకు పైగా గడ్డకట్టి ఉంచిన పిండం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన దంపతులు, 2004 నాటి ఐవీఎఫ్ మిగిలిన పిండంతో మళ్లీ తల్లికావాలని నిర్ణయించుకున్నారు. చట్టపరమైన వయసు పరిమితి ముగిసేలోపు ఈ అద్భుతం సాధించి కూతురు జార్జియాకు జన్మించారు.