హనుమాన్ అంశ్ సంచలన విజయంపై నటి రిచా చద్దా కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
ప్రస్తుత ఏడాదిని కంటెంట్ ఆధారిత సినిమాలకు మైలురాయిగా చెప్పలేమని నటి రిచా చద్దా పేర్కొన్నారు. హనుమాన్ అంశ్ చిత్రం ఘనవిజయం సాధించినప్పటికీ, ప్రేక్షకుల రుచిలో విస్తృత మార్పు వచ్చిందని ముగింపుకు రావడం తొందరపాటే అవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చిత్రాలను అందరూ చూడటం సాధారణమేనని, మంచి స్క్రిప్ట్‌లు, రచయితలకు తగిన పారితోషికం అందితేనే చిత్ర పరిశ్రమలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని రిచా చద్దా అభిప్రాయపడ్డారు.