ఆదోని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు: మౌలిక వసతుల కల్పనకు కమిషనర్ హామీ

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని పట్టణంలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలపై కూటమి నాయకులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ప్రజల ఇబ్బందులను పరిశీలించి త్వరలోనే తగిన నిధులు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.