అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణం: ఎంఈపీ పనులకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

అమరావతిలో సచివాలయం మరియు హెచ్ఓడీ కార్యాలయాల ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసిందని, రూ. 768.89 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే హైసైడ్ ఎంఈపీ పనుల కాంట్రాక్టును షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుందని అధికారులు తెలిపారు. టవర్లలో విద్యుత్ సరఫరా, సెంట్రలైజ్డ్ ఏసీ, ఫైర్ సేఫ్టీ, ప్లంబింగ్ వంటి కీలక మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.