గిరిజన ప్రాంతంలో ఉత్తమ గురువులకు ఘన సన్మాన వేడుక
రిపోర్టర్: Laxman Regam
స్థలం: అనంతగిరి
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. సభకు నరాజీ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శెట్టి రాంబాబుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. గిరిజన విద్యార్థులకు సేవలు అందిస్తున్న గురువులను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉపాధ్యాయులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.