పిఠాపురంలో రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Pithapuram
పిఠాపురం నియోజకవర్గంలో రూ.1,500 కోట్ల భారీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, కొత్త వాటికి శంకుస్థాపనలు చేశారు. ఈ చర్యల ద్వారా పిఠాపురంలో మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు సంక్షేమ పథకాలు మరింత వేగంగా ప్రజలకు అందనున్నాయని స్పష్టం చేశారు.