స్థానిక ఎన్నికల్ లో వైఎస్సార్సీపీకి షాక్: నాగులూరు అభ్యర్థి బహిష్కరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

పోలింగ్ వేళ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని నాగులూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారని స్థానిక నాయకులు తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మండల నేతల నుంచి ఎలాంటి సహకారం అందలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతల వైఖరిపై తీవ్ర నిరసన తెలుపుతూ బరి నుంచి తప్పుకుంటున్నట్లు వాట్సాప్ గ్రూప్ లో సందేశం పంపడంతో జిల్లా రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేగింది.