పార్టీ బలోపేతానికి ఐక్యతతో సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ప్రత్తిపాడు
ప్రత్తిపాడులో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరయ్యి శ్రేణులతో విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యతతో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.