స్ట్రెచర్‌పై పరీక్షలు రాసి గూగుల్ ఉద్యోగం సాధించిన యువతి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
పదహారేళ్ల వయసులో నాల్గవ అంతస్తు నుండి కిందపడి తీవ్రంగా గాయపడిన ఒక యువతి, ప్రాణాపాయం నుంచి కోలుకుని అద్భుత విజయం సాధించిందని ఆమె సోదరుడు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రెండేళ్ల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, స్ట్రెచర్‌పై వచ్చి ఇంటర్ పరీక్షలు రాసి 92 శాతం మార్కులు సాధించింది. రెండు డిగ్రీలు పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం హైదరాబాద్‌లోని గూగుల్ సంస్థలో ఉద్యోగం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.