తరగతి గదుల్లో క్రమశిక్షణ లేమిపై ఆందోళనకర నివేదిక వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆస్ట్రేలియా

తాజా పీసా అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా తరగతి గదుల్లో క్రమశిక్షణ లోపించింది. విద్యార్థులు పాఠాలు వినకుండా అల్లరి చేయడం, డిజిటల్ పరికరాలతో నిత్యం పరధ్యానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 80 విద్యా వ్యవస్థల్లో ఆస్ట్రేలియా 69వ స్థానంలో నిలిచింది. బోధనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.