కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వందల కోట్ల ఆలయ భూములు కబ్జా
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దుర్గ గుడితో పాటు పలు ప్రముఖ ఆలయాలకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయి. విజయవాడ, శివారు ప్రాంతాల్లో దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపంతో భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టాభిరామస్వామి, కుమార సిద్ధయ్య మఠం భూములు కబ్జాదారులపాలయ్యాయి. రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది.